Mallu Bhatti Vikramarka: పద్మారావు గారు అందరూ మెచ్చేలా సభ నడుపుతారని ఆశిస్తున్నా: భట్టివిక్రమార్క

  • డిప్యూటీ స్పీకర్‌ గా ఎన్నిక సందర్భంగా వ్యాఖ్య
  • పార్టీలకతీతంగా ఎన్నుకోవడాన్ని గుర్తుచేసిన సీఎల్పీ నేత
  • మీ నిర్ణయాలు అందరి ఆమోదం పొందాలి
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్ ఎన్నికైన సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆయన మాట్లాడుతూ పార్టీల కతీతంగా అందరం కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. అందరూ మెచ్చేలా సభ నడుపుతారని ఆశిస్తున్నానన్నారు.

సభా సంప్రదాయాల్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే క్రమంలో మీ ఎన్నిక ద్వారా సభ తన వివేచనను తెలియజేసిందని, మీ నిర్ణయాలతో దాన్ని మీరు కొనసాగించాలని కోరారు. స్పీకర్‌ లేదా మీరు ఎవరు ఆ స్థానంలో కూర్చున్నా మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేదప్రజల కోసం పనిచేశారని, మీ ప్రాంత ప్రజలకోసం మీరు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ సభ్యుల హక్కుల్ని కాపాడాలని కోరుతున్నానన్నారు.
Mallu Bhatti Vikramarka
dy.speaker padmarao

More Telugu News