Hyderabad: చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తి బుగ్గిపాలు

  • ఆదివారం అర్ధరాత్రి ఎగసిపడిన అగ్నికీలలు
  • ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల ఆరా
  • తప్పిన ప్రాణనష్టం
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలైనట్టు తెలుస్తోంది. అయితే, ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఫేజ్ త్రీలోని ఎస్ఈఆర్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.  
Hyderabad
Charlapally
IDA
Fire Accident
Telangana

More Telugu News