Bangladesh: బంగ్లాదేశ్ విమానం హైజాక్ యత్నం.. చాకచాక్యంగా అడ్డుకున్న పైలెట్లు!

  • అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నం
  • కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు విఫలయత్నం
  • చిట్టగాంగ్‌లో దించేసిన అధికారులు
విమానాన్ని హైజాక్ చేసేందుకు దుండగుడు చేసిన ప్రయత్నాన్ని చాకచాక్యంగా అడ్డుకున్నారు. ఢాకా నుంచి దుబాయ్ వెళ్లేందుకు బయలుదేరిన బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీజీ 147 విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేసేందుకు యత్నించాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి విమానం ఎగురుతున్న సమయంలోనే దానిని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నించాడు. అకస్మాత్తుగా తుపాకి తీసి, కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశాడు.

తనవద్ద బాంబ్ ఉందని బెదిరించడమే కాకుండా కాల్పులు జరపడంతో పైలెట్లు అత్యవసరంగా విమానాన్ని బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో దించేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సాయుధ బలగాలు విమానాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే దుండగుడితో పాటు ఇద్దరు విమాన సిబ్బంది విమానంలోనే ఉన్నారని.. దుండగుడు బంగ్లాదేశ్ ప్రధానితో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాడని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
Bangladesh
chittagang
BG 147
Flight

More Telugu News