Andhra Pradesh: విశాఖ టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు

  • స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత
  • భారీగా తరలివచ్చిన క్రికెట్ ప్రియులు 
  • విశాఖ-శ్రీకాకుళం జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు
భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ విశాఖ వేదికగా మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు పద్నాలుగు వందల మంది పోలీసులతో భద్రత కల్పించారు. స్టేడియానికి వెళ్లే విశాఖ-శ్రీకాకుళం జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా, పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు ఏసీఏ వీడీసీఏ మైదానంలో నివాళులర్పించారు. రెండు జట్ల క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Andhra Pradesh
Visakhapatnam District
cricket
india
Australia
Srikakulam District
t20

More Telugu News