Telangana: హరీశ్ రావుపై జగ్గారెడ్డి మండిపాటు
- ఏడుపాయల జాతరకు నీళ్లు లేవు
- భక్తులకు హరీశ్ ఏం సమాధానం చెబుతారు
- హరీశ్ రావు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
టీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. హరీశ్ తీరుతో ఇప్పుడు ఏడుపాయల జాతరకు నీళ్లు లేవని, భక్తులకు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నాడు మంత్రిగా అత్యుత్సాహంతోనే సింగూరు నీళ్లు తరలించారని, హరీశ్ రావు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తనను రాజకీయంగా అణగదొక్కేందుకు హరీశ్ ప్రయత్నించింది నిజమని, చాణక్యనీతిలో ముందుకు వెళ్తే భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ది అమ్ముడుపోయే వ్యక్తిత్వం కాదని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకి వెళ్లినా, వారి ఆర్థిక బలహీనతలే కారణమని వ్యాఖ్యానించారు.