Andhra Pradesh: రేపు ఏపీకి వస్తోన్న మోదీని ప్రజలందరూ నిలదీయాలి: సీఎం చంద్రబాబు పిలుపు

  • రాష్ట్రానికి న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు
  • ప్రశాంత్ కిశోర్ సలహాలతో జగన్ కుట్రలు చేస్తున్నారు
  • జగన్ ని కేసీఆర్ రెచ్చగొడుతున్నారు
రేపు ఏపీకి వస్తోన్న ప్రధాని మోదీని ప్రజలందరూ నిలదీయాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిశోర్ సలహాలతో జగన్ కుట్రలు చేస్తున్నారని, డబ్బు ఎవరు ఎక్కువగా ఇస్తామంటే వారికే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తరహా దిగజారుడు రాజకీయాలు తన జీవితంలో చూడలేదని విమర్శించారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ లు ముసుగు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పులివెందుల అరాచకాలు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని జగన్ ని కేసీఆర్, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను కేటీఆర్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
Jagan
Chandrababu

More Telugu News