Andhra Pradesh: ఏపీలో జగన్ సీఎం కావాలని కేటీఆర్ అనడం దారుణం: సీఎం చంద్రబాబు

  • ఏపీ అభివృద్ధి చెందకుండా మోదీ, కేసీఆర్, జగన్ యత్నం
  • ఏపీలో మళ్లీ టీడీపీయే రావాలి
  • లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు
ఏపీలో జగన్ సీఎం కావాలని కేటీఆర్ అనడం దారుణమని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని మోదీ, కేసీఆర్, జగన్ కోరుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో మళ్లీ టీడీపీయే అధికారంలోకి రాకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. వైసీపీ నేతలు బీజేపీతో కుమ్మక్కె దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే అభివృద్ధి విషయంలో తమతో పోటీ పడాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, రాష్ట్రాన్ని ఆదుకుంటామని ఘంటాపథంగా చెప్పారు. అరకు పార్లమెంట్ లో టీడీపీదే గెలుపని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh
KTR
Chandrababu
jagan
YSRCP

More Telugu News