పోలవరం ప్రాజెక్టు రోడ్డుపై భారీ పగుళ్లు.. భయంతో పరుగులు తీసిన సందర్శకులు, ప్రజలు!
- ప్రాజెక్టు స్పిల్ వే రెస్టారెంట్ వద్ద ఘటన
- రంగంలోకి దిగిన పోలవరం ప్రాజెక్టు అధికారులు
- పగుళ్లను పూడ్చాలని కాంట్రాక్టర్ కు ఆదేశం
ఈ విషయమై ఓ సీనియర్ ఇంజనీర్ మాట్లాడుతూ.. మట్టిలో తేమ శాతం తగ్గినప్పుడు ఇలాంటి పగుళ్లు ఏర్పడుతుంటాయని తెలిపారు. అంతేకాకుండా ప్రాజెక్టు పనుల్లో భాగంగా పేలుళ్లు జరిపినప్పుడు వదులుగా ఉన్న భూమి కుంగి పగుళ్లు ఏర్పడతాయన్నారు. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.