Andhra Pradesh: చంద్రబాబును ఓడించడానికి నువ్వు ఉండగా.. మోదీ, కేసీఆర్ తో మాకు పనేంటి?: లోకేశ్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్లు పోతాయని వ్యాఖ్య
  • లెంపలేసుకోవాలని టీడీపీ నేతకు సూచన
  • జగన్-మోదీ-కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్న లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఓడించడానికి ముగ్గురు మోదీలు(మోదీ, కేసీఆర్, జగన్) కలిసి కుట్రలు పన్నుతున్నారన్న లోకేశ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చంద్రబాబును ఓడించడానికి లోకేశ్ ఉన్నారనీ, ఇక తమకు కేసీఆర్, మోదీలతో ఏం పని? అని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్లు పోతాయనీ, లెంపలేసుకోవాలని లోకేశ్ కు సూచించారు.

ఈ రోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘డియర్ లోకేశ్.. మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా... మాకు మోదీ, కేసీఆర్ లతో ఏంపని చెప్పు? తప్పమ్మా.. ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!’ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
KCR
Narendra Modi
Jagan
Twitter

More Telugu News