Siddardh: పాకిస్థాన్‌తో అన్ని బంధాలను తెంచుకోండి.. మన హీరోలను కాపాడండి!: సిద్ధార్థ్

  • నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్
  • ప్రపంచాన్ని మనవైపు నిలబడేలా చేయండి
  • మన హీరోలను కాపాడండి
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ సామాజిక  సమస్యలపై తరచూ సినీ హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ ఉంటాడు. పుల్వామా దాడి జరిగిన వెంటనే ఘటనను తీవ్రంగా ఖండించాడు. అమర జవానుల కుటుంబాలకు సానుభూతి తెలిపాడు. తాజాగా ఈ ఘటనపై మరోసారి స్పందించాడు.

నమ్మకద్రోహానికి పాకిస్థాన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘పాకిస్థాన్ ను కట్టడి చేయడం ఎందుకంత కష్టంగా మారింది? తప్పులపై తప్పులు చేసే వీళ్లను అస్థిరత్వ, నమ్మక ద్రోహ పొరుగువాళ్లగా ముద్ర వేయాలి. వారితో రాజకీయ, సామాజిక, ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలి. అంతర్జాతీయ సమాజం ముందు సమస్యను ఉంచి ప్రపంచాన్ని మనవైపు నిలబడేలా చేయండి. మన హీరోలను కాపాడండి’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Siddardh
Twitter
Pakistan
Heros
Soliders
Social Media

More Telugu News