jagan: ఏపీలో జగన్ గెలవబోతున్నారు.. విజయవాడలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరు: కేటీఆర్

  • చేతకాని తనం వల్ల చంద్రబాబు ఓడిపోనున్నారు
  • ఏపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఏం చేసిందో చంద్రబాబు చెప్పాలి
  • పవన్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకే నష్టం
రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధినేత జగన్ గెలవబోతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. చేతకాని తనం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఓడిపోనున్నారని చెప్పారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెబుతున్న చంద్రబాబు... కనీసం విజయవాడలో కూడా చక్రం తిప్పలేరని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని... చంద్రబాబుకు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ఏపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఏం చేసిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

జన్మభూమి కమిటీలతో ప్రజలను చంద్రబాబు వేధించారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఓవైపు... దేశంలో మేమే నెంబర్ వన్ అని మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకే నష్టమని అన్నారు.
jagan
KTR
chandrababu
Telugudesam
TRS
ysrcp

More Telugu News