Tollywood: ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు....చితికి నిప్పంటించిన కుమార్తె దీపిక!

  • జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • అంతకుముందు ఫిలిం ఛాంబర్ కు భౌతికకాయం తరలింపు
  • నివాళులు అర్పించిన అభిమానులు, సినీ ప్రముఖులు
నిన్న మరణించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ఈరోజు ముగిశాయి. తొలుత కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్ కు తరలించారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి భౌతికకాయాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తె దీపిక తండ్రి చితికి నిప్పంటించారు.

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోడి రామకృష్ణ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున సహా పలువురు నటీనటులు, రాజకీయ నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కోడి రామకృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Tollywood
kodi ramakrishna
last rites
Hyderabad
Telangana

More Telugu News