Mahesh Babu: రీ షూట్ చేయవలసిందేనంటోన్న మహేశ్ బాబు?

  • 'భరత్ అనే నేను' భారీ హిట్ 
  • 'మహర్షి'పై మహేశ్ ప్రత్యేక శ్రద్ధ
  •  అసంతృప్తి కలిగించిన సీన్స్ రీ షూట్
మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' రూపొందుతోంది. భారీ బడ్జెట్ కావడంతో ఈ సినిమాకి అశ్వనీదత్ .. దిల్ రాజు .. పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి ముందు మహేశ్ చేసిన 'భరత్ అనే నేను' భారీ హిట్ కావడం వలన, ఆ తరువాత సినిమా కూడా ఆ స్థాయి హిట్ కావాలనే పట్టుదలతో మహేశ్ వున్నాడు.

ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రాదనీ .. జూన్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ నిన్నటి నుంచి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. అనుకున్న పనులు పూర్తికాకపోవడం వల్లనే విడుదల వాయిదా అనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని సన్నివేశాలు అనుకున్నట్టుగా రాకపోవడం వలన .. భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వలన అసంతృప్తికి లోనైన మహేశ్ బాబు, రీ షూట్ చేయమని చెప్పాడట. అందువల్లనే విడుదల తేదీ మారుతుందని చెప్పుకుంటున్నారు. 
Mahesh Babu
pooja hegde

More Telugu News