Andhra Pradesh: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ఫస్ట్ వీడియో సాంగ్.. రేపు విడుదల చేయనున్న వర్మ!

  • ఉదయం 9.27 గంటలకు రిలీజ్
  • ఈ పాటను బాలు ఆలపించారని వెల్లడి
  • ఇప్పటికే ట్రైలర్ విడుదల చేసిన వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే రిలీజ్ చేసిన వర్మ.. అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తిని అమాంతం పెంచేశారు. తాజాగా ఈ సినిమాలో తొలి వీడియో పాటను రేపు ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని వెల్లడించారు. దివంగత ఎన్టీఆర్ సినిమాల్లోని పాటల్లో చాలావరకూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆలపించారని గుర్తుచేశారు.
Andhra Pradesh
Telangana
Tollywood
lakshmies ntr
first video song
release
ram gopal varma

More Telugu News