వాట్సాప్ ద్వారా చేసే వేధింపులకు చెక్... ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఈమెయిల్!
- కేటుగాళ్లను అడ్డుకునేందుకు డాట్ నిర్ణయం
- అభ్యంతరకర, అశ్లీల సందేశాలు పంపేవారికి ముకుతాడు
- ఫిర్యాదు చేసిన వెంటనే ప్రొవైడర్లు, పోలీసుల దృష్టికి
ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో డాట్ అప్రమత్తమయింది. వేధింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణం ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక మెయిల్‌ను రూపొందించింది. [email protected] మెయిల్‌కు బాధితులు ఫిర్యాదు పంపిన వెంటనే దాన్ని పోలీసులతోపాటు సంబంధిత ప్రొవైడర్ దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాట్ వెల్లడించింది.