pulwama: భారత్ ను చూసి పాక్ భయపడుతున్నట్టుంది.. మోదీకి భయపడవద్దు: టెర్రరిస్ట్ మసూద్ అజార్

  • మోదీ బెదిరింపులకు ఇమ్రాన్ స్పందించిన తీరు పేలవంగా ఉంది
  • పాక్ స్పందన నన్ను నిరాశకు గురి చేసింది
  • పుల్వామా దాడి ఎన్నికల్లో మోదీకి లాభించదు
పుల్వామా ఘటన అనంతరం భారత్ చేస్తున్న ఒత్తిళ్లకు పాకిస్థాన్ లొంగకూడదని ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ అన్నాడు. భారత ప్రధాని మోదీ బెదిరింపులకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిస్పందించిన తీరు పేలవంగా ఉందని చెప్పాడు. భారత్ కు పాక్ భయపడుతున్నట్టు అర్థమవుతోందని అన్నాడు. పాకిస్థాన్ స్పందన తనను నిరాశకు గురి చేసిందని చెప్పాడు. పుల్వామా దాడి ఎన్నికల్లో మోదీకి లాభిస్తుందంటూ వస్తున్న విశ్లేషణలను ఖండించాడు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న చర్యలు ఫలిస్తున్నాయని మోదీ చెబుతున్న మాటలు ఈ దాడితో తేలిపోయాయని చెప్పాడు. ఇదే సమయంలో పాకిస్థాన్ మీడియాపై కూడా మండిపడ్డాడు. ఓ ఆడియో సందేశంలో ఈ మేరకు మసూద్ అజార్ స్పందించాడు.
pulwama
masood azhar
modi
imran khan
pakistan
india

More Telugu News