Kodi Ramakrishna: మధ్యలో ఆగిపోయిన బాలకృష్ణ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కోడి రామకృష్ణ

  • ‘లయన్‌కింగ్’ నుంచి కథ తీసుకున్నాం
  • ఎందుకు ఆగిందో తెలియదు
  • ఎక్కడో బ్రేక్ వచ్చింది
నందమూరి బాలకృష్ణ అభిమానించే దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. బాలయ్యతో ఆయన తీసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఆయన కొన్నాళ్ల క్రితం బాలయ్యతో సినిమాను ప్రారంభించి.. 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక దానిని వదిలేశారు. అసలు ఆ సినిమా ఎందుకు ఆగిందో కూడా తెలియదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అంతేకాదు ఎప్పటికైనా ఆ చిత్రాన్ని పూర్తి చేసి హిట్ కొడతానని ఆ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ఆ సినిమాయే ‘విక్రమసింహ’!

ఈ సినిమా గురించి గతంలో కోడి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘దీని గురించి సింబాలిక్‌గా చెబుతాను. ఆమధ్య కనపడకుండా పోయిన మలేసియా విమానం... ఎందుకు పడిపోయింది, ఎవరు పడేశారు, ఎక్కడ పడిపోయిందో ఇప్పటి వరకూ తెలియదు. విక్రమసింహ కూడా అంతే. లయన్‌కింగ్‌ అనే ఆంగ్ల సినిమా నుంచి కథ తీసుకొని వర్క్‌ చేశాం. స్టార్ట్‌ చేసిన సినిమా ఎందుకు ఆగిందో తెలీదు. ఎక్కడో బ్రేక్‌ వచ్చింది. 60 శాతం పూర్తయింది. మరో 20 రోజుల్లో పూర్తయ్యేది. దానిమీద ఇప్పుడు మళ్లీ వర్క్‌ చేస్తున్నాం. ఎప్పటికైనా అది పూర్తయి పెద్ద హిట్‌ అవుతుంది’’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన దివంగతులయ్యారు.
Kodi Ramakrishna
Balakrishna
Vikramasimha
Malaycia Flight
Lion king

More Telugu News