Mahesh Babu: 'మహర్షి' విడుదల తేదీ మళ్లీ వాయిదా?

  • ముందుగా చెప్పిన విడుదల తేదీ ఏప్రిల్ 5
  • వాయిదా పడిన తేదీ ఏప్రిల్ 25
  • జూన్ లో థియేటర్స్ కి వచ్చే ఛాన్స్  
మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి 'మహర్షి' సినిమాను రూపొందిస్తున్నాడు. అశ్వనీదత్ .. పీవీపీ .. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ సమయానికి అన్ని పనులు పూర్తికాకపోవచ్చనే ఉద్దేశంతో, ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నామని అన్నారు.

కానీ ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే అవకాశాలు లేవనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇంకా షూటింగ్ చేయవలసిన సీన్స్ ఎక్కువగానే ఉండటం .. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి ఎక్కువ సమయం పట్టేలా ఉండటమే ఇందుకు కారణమనే మాట వినిపిస్తోంది. మహేశ్ బాబు కెరియర్లో సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్న సినిమా కావడంతో, హడావిడి పడకుండా జూన్ లో విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.
Mahesh Babu
pooja hegde

More Telugu News