Rahul Gandhi: కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ

  • 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు
  • రోడ్డు మార్గంలో అలిపిరి గేటు వద్దకు
  • రాహుల్‌ రాక సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శ్రీవారి దర్శనార్థం కాలినడకన బయలుదేరారు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం జరగనున్న ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో 11.30 గంటలకు రాహుల్‌ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో అలిపిరి గేటు వద్దకు చేరుకుని  మెట్ల మార్గంలో స్వామి దర్శనానికి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు.  రాహుల్‌ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.
Rahul Gandhi
tirumala
walkpath

More Telugu News