kcr: అసెంబ్లీలో అమర జవాన్లకు సంతాపం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్.. ఒక్కో కుటుంబానికి 25 లక్షల సాయం!

  • ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • అమర జవాన్లకు నివాళి అర్పించిన శాసనసభ
  • జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామన్న కేసీఆర్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అనంతంరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
kcr
pualwama
jawan
telangana
assembly

More Telugu News