Andhra Pradesh: ఇంట్లో బాంబు పేల్చిన కోడెల, గన్ పేల్చిన బాలకృష్ణ టీడీపీలోనే ఉన్నారు!: రోజా ఎద్దేవా

  • జగన్ ప్రజాదరణను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు
  • టీడీపీ-కాంగ్రెస్ కలిసి జగన్ పై అక్రమ కేసులు పెట్టాయి
  • తప్పు చేయలేదు కాబట్టే జగన్ విచారణకొస్తున్నారు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. అందుకే హీరో నాగార్జున జగన్ ను ఎందుకు కలిశారని బాబు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. నేరారోపణ, నేరచరిత్ర కలిగిన వారిని ఏపీ ముఖ్యమంత్రే పక్కన పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇంట్లో బాంబు పేల్చిన కోడెల శివప్రసాద్, గన్ పేల్చిన బాలకృష్ణ టీడీపీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు ఇటీవలి కాలంలో అసహనం పెరిగిపోయిందని రోజా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు అయి జగన్ పై కేసులు పెట్టాయని ఆమె విమర్శించారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే జగన్ విచారణకు హాజరవుతున్నారని స్పష్టం చేశారు.

ఈ అక్రమ కేసుల నుంచి జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని విచారణకు హాజరుకాని ముద్దాయి చంద్రబాబు అని రోజా మండిపడ్డారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
Jagan
roja
Chandrababu
kodela
Balakrishna

More Telugu News