Gaurav Chandra Dutt: నా చావుకు మమత బెనర్జీనే కారణం.. నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి
- కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- మణకట్టు కోసుకుని ఆత్మహత్య
- ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ను మీడియాకు పంపిన అధికారి
కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి గౌరవ్ దత్ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన, 1986 బ్యాచ్‌కి చెందిన దత్ మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీనే కారణమని పరోక్షంగా చెబుతూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్‌ను ఆయన కొన్ని మీడియా సంస్థలకు కూడా పంపారు.
తనపై ఉన్న పెండింగ్ కేసులను కొట్టివేసేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అంగీకరించలేదని ఆ లేఖలో ఆరోపించిన దత్.. ఓ ఫైల్‌ను ఉద్దేశపూర్వకంగా మాయం చేశారని వాపోయారు. మరో కేసులో తనపై చేసిన ఆరోపణలు రుజువు కాలేదని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత రావాల్సిన ప్రయోజనాలను కూడా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.