New Delhi: దోమల్ని చంపబోయి ఇల్లు కాల్చుకున్న టీవీ నటి!

షార్ట్స్‌లో చూడండి
హిందీ సీరియళ్ల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య టాండన్ అనే నటి తృటిలో ప్రమాదం తప్పించుకుంది. తన బెడ్ రూమ్ లో దోమలను పారదోలేందుకు మస్కిటో రిపెల్లెంట్ ఆన్ చేసి అలాగే నిద్రపోయింది. అయితే ఆ రిపెల్లెంట్ లో మంటలు చెలరేగడంతో కొద్ది వ్యవధిలోనే ఇంట్లో మంటలు చెలరేగాయి.

అర్ధరాత్రి వేళ తన గదిలో మంటలు రావడం చూసిన సౌమ్య తన బామ్మతో కలిసి ఒక్కుదుటున లేచింది. అప్పటికే రూమ్ లో చాలావరకు వ్యాపించిన మంటలను అతికష్టమ్మీద ఆర్పేసింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటనలో సదరు టీవీ నటి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడింది.

భాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్ తో ఉత్తరాది రాష్ట్రాల్లో సౌమ్య టాండన్ ఎంతో పాప్యులర్. ఈ ప్రమాదం ద్వారా తాను మూడు గుణపాఠాలు నేర్చుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. బెడ్ పక్కనే మస్కిటో రిపెల్లెంట్ ను ఎప్పుడూ పెట్టుకోకూడదని, లూజ్ కనెక్షన్ ఉన్న వస్తువులను ఎప్పుడూ ప్లగ్ చేయకూడదని, అగ్నిమాపక ఉపకరణాలను ఎల్లవేళలా ఇంట్లో ఉంచుకోవాలని తాను ఈ ఘటనతో నేర్చుకున్నానని వివరించింది.
Go Back to Shorts
New Delhi

More Telugu News