Tollywood: ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఆదా శర్మ న్యూస్ పేపర్ డ్రెస్

  • సరికొత్త లుక్ లో టాలీవుడ్ హీరోయిన్
  • సోషల్ మీడియాలో సందడి
  • లైకులు, షేర్ల వెల్లువ

మొదటి చిత్రం హార్ట్ అటాక్ తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి ఆదా శర్మ. పూరీ జగన్నాథ్, నితిన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నా హీరోయిన్ ఆదా శర్మకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కల్కి అనే చిత్రంలో నటిస్తున్న ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక సందడి చేస్తూ ఉంటుంది.

తాజాగా, న్యూస్ పేపర్ ను పోలిన డ్రెస్ ధరించి మరోసారి కలకలం రేపింది. న్యూస్ పేపర్ ప్రింట్ తరహాలో ఉన్న ఈ గౌన్ ను ఫయాజ్ జరీవాలా డిజైన్ చేశారు. ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదా శర్మ ఈ వెరైటీ డ్రెస్ లోనే వచ్చింది. దాంతో ఈ ఈవెంట్ లో ఆదానే ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ న్యూస్ పేపర్ డ్రెస్ లో తాను ఎంత విలక్షణంగా ఉందో సోషల్ మీడియాలో పోస్టు పెట్టి మురిసిపోయింది ఆదా శర్మ. లక్షల్లో లైకులు వస్తుండడంతో తన కొత్త డ్రెస్ కు అభిమానులు ఆమోదం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News