krish: 'మహానాయకుడు' తరువాత క్రిష్ ప్లాన్ అదేనట

షార్ట్స్‌లో చూడండి
క్రిష్ దర్శకత్వం వహించిన 'మహానాయకుడు' రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిభాగమైన 'కథానాయకుడు' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోవడం క్రిష్ అభిమానులను నిరాశ పరిచింది. దాంతో అంతా 'మహానాయకుడు'పై దృష్టి పెట్టారు. కొంతకాలం పాటు 'మణికర్ణిక'పై .. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టి పెడుతూ వచ్చిన క్రిష్, 'మహానాయకుడు' తరువాత ఏ సినిమా చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే క్రిష్ కొన్ని కథలను సిద్ధం చేసి ఉంచారట. ఆ కథలపై గట్టిగా కసరత్తు చేసి 'ఆర్కా మీడియా'వారితో సెట్స్ పైకి వెళ్లే ఆలోచన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుందనుకుంటే తన సొంత బ్యానర్లో చేయడానికి రంగంలోకి దిగిపోవాలని భావిస్తున్నారట. సొంత బ్యానర్లో చేస్తే మాత్రం కొత్త నటీనటులతో చేయాలనే ఉద్దేశంతో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఒక కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడని చెప్పుకుంటున్నారు. 
Go Back to Shorts
krish

More Telugu News