super deluxe: ‘సూపర్ డీలక్స్’ సెకండ్ లుక్ విడుదల

  • ఈ చిత్రం ట్రైలర్ ని రేపు విడుదల చేస్తాం
  • వచ్చే నెల 29న సినిమా విడుదల
  • ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ తదితరులు
ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్, మిస్కిన్ నటిస్తున్న
సినిమా ‘సూపర్ డీలక్స్’. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘సెకండ్ లుక్’ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. ఈ చిత్రం ట్రైలర్ ని రేపు విడుదల చేస్తామని, ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 29న సినిమాను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. కాగా, ‘సూపర్ డీలక్స్’లో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో కనిపించనుంది. ‘లీల’ అనే శృంగార తార పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు వెల్లడించారు.  


super deluxe
movie
vijay sethpathi
samantha

More Telugu News