amit shah: చంద్రబాబు, జగన్ లతో అది సాధ్యం కాదు: అమిత్ షా

  • ఏపీ అభివృద్ధి చంద్రబాబు, జగన్ లతో సాధ్యం కాదు
  • మోదీని మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు
  • చంద్రబాబుకు పాక్ ప్రధానిపై ఉన్న నమ్మకం భారత ప్రధానిపై లేదు
ఏపీ అభివృద్ధి సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లతో సాధ్యం కాదని... ప్రధాని మోదీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలని విమర్శించారు. గతంలో వాజ్ పేయి, ఎన్టీఆర్ లను చంద్రబాబు మోసం చేశారని... ఇప్పుడు మోదీని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో బీజేపీ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు పాక్ ప్రధానిపై ఉన్న నమ్మకం భారత ప్రధానిపై లేదని అమిత్ షా అన్నారు. రాజకీయాలకు కూడా ఒక హద్దు ఉండాలని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. ఏపీకి ఇన్ని ప్రాజెక్టులు ఎప్పుడూ రాలేదని తెలిపారు. కోస్తా ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం రూ. 55,475 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుకు రూ. 180 కోట్లు ఇచ్చామని తెలిపారు.  
amit shah
bjp
Chandrababu
Telugudesam
jagan
ysrcp
modi

More Telugu News