Talasani: తలసాని శ్రీనివాసయాదవ్ కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు!

  • రెండోసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని
  • మంత్రిని కలుసుకున్న మా ప్రతినిధులు
  • పుష్పగుచ్ఛాలు అందించిన శివాజీరాజా, పరుచూరి

టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాసయాదవ్ తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రతినిధులు శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి తదితరులు మంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసానికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News