Kishan Reddy: చంద్రబాబు ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడని అనుకోలేదు: కిషన్ రెడ్డి

  • పుల్వామా వెనుక మోదీ లబ్ధి ఉందన్న చంద్రబాబు
  • తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి
  • మమతతో కలిసి దిగజారుడు రాజకీయాలని విమర్శలు
పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లబ్ధి దాగున్నట్టు అనుమానం వస్తోందన్న వ్యాఖ్యలు చంద్రబాబు నోటి నుంచి వస్తాయని తాను ఊహించలేదని తెలంగాణ బీజేపీ నేత జీ కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రపంచ దేశాలన్నీ ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్న వేళ, మమతా బెనర్జీతో కలిసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు, వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టాల్సిన వ్యక్తులు, రాజకీయాలు చేయడం దుర్మార్గమని, ఈ సమయంలో మాట్లాడాల్సిన మాటలు ఇవి కావని ఆయన అన్నారు. ఎన్డీయే సర్కారు వచ్చిన తరువాత సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి పరిఢవిల్లుతోందని అన్నారు.
Kishan Reddy
Chandrababu
Pulwama
Narendra Modi

More Telugu News