telangana cbinet: తెలంగాణ కేబినెట్‌ తొలి సమావేశం నేడు

  • ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ
  • రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాధాన్యం
  • ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం
తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ తొలి కేబినెట్‌ సమావేశం నేడు జరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క మంత్రితో ప్రమాణ స్వీకారం చేసిన సీఎం కేసీఆర్‌ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత రెండు రోజుల క్రితం కేబినెట్‌ను విస్తరించిన విషయం తెలిసిందే. శాఖల కేటాయింపు కూడా పూర్తికావడంతో పూర్తి కేబినెట్‌ ఈరోజు భేటీ అవుతోంది.

శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.  ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సాయంత్రం జరిగే సమావేశంలో కీలకమైన ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక శాఖను తనవద్దే అట్టేపెట్టుకోవడంతో అసెంబ్లీలో బడ్జెట్‌ను కూడా ఆయనే ప్రవేశపెట్టనున్నారని సమాచారం.
telangana cbinet
first meeting
pragathibhavan
Hyderabad

More Telugu News