Police: 140 కి.మీ వేగంతో వస్తూ కారు బీభత్సం... విజయవాడలో ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!

  • అతివేగంతో అదుపు తప్పిన కారు
  • నాగార్జున అనే యువకుడు మృతి
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
గుంటూరు, విజయవాడ మధ్య జాతీయ రహదారిపై అతి వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించగా, కారులోని ఓ యువకుడు మరణించాడు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో కారులోని ఓ యువతి, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

విజయవాడకు చెందిన నాగార్జున, ప్రియాంక, హరీశ్, మరో యువకుడు కలిసి గుంటూరు వైపు నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కారు అదుపు తప్పింది. తొలుత ఫెన్సింగ్ ను ఢీకొట్టిన కారు, ఆపై ఆగివున్న లారీని బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నాగార్జున అక్కడికక్కడే మరణించాడు. మిగతావారు చెల్లాచెదరుగా రోడ్డుపై పడిపోయారు. విషయం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు, గాయపడిన వారిని సెంటినీ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.
Police
Car
Road Accident
Vijayawada
Guntur

More Telugu News