America: అమెరికాలో తెలంగాణ వాసిని కాల్చి చంపిన దుండగులు

  • తుపాకి గుళ్లకు మరో తెలంగాణ వాసి దుర్మరణం
  • ఏడేళ్ల క్రితమే ఉద్యోగం కోసం ఫ్లోరిడాకు
  • మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు భారత్ సాయం చేయాల్సిందిగా వేడుకోలు
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న తెలంగాణ వాసి కొత్త గోవర్ధన్ రెడ్డి దుండగుల తుపాకి కాల్పులకు బలయ్యాడు. ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయనపై అగంతుకులు కాల్పులతో తెగబడ్డారు. పెన్సాకోలా సమీపంలో జరిగిన ఈ ఘటనలో గోవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నిందితులు దొంగలై ఉంటారని, దోచుకునేందుకే వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేటకు చెందిన గోవర్ధన్ రెడ్డి ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివసిస్తున్నారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోవర్థన్ మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా అర్థిస్తున్నారు.
America
Florida
Hyderabad
Telangana
Uppal
Gul fire

More Telugu News