kcr: మహిళలపై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారు... ఆయనపై షీటీమ్ కేసు పెట్టాలి: కిషన్ రెడ్డి

  • కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు
  • గత ప్రభుత్వ కేబినెట్ లో కూడా మహిళలు లేరు
  • ఈసారైనా అవకాశం దక్కుతుందనుకున్న వారికి నిరాశే మిగిలింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఎస్ కేబినెట్ కూర్పును ఆయన తప్పుబట్టారు. కేబినెట్ లో మహిళలు, గిరిజనులకు చోటు కల్పించలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ మంత్రిమండలిలో కూడా ఒక్క మహిళకు కూడా కేసీఆర్ అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఈసారైనా అవకాశం దొరుకుతుందని మహిళలు ఆశించారని... మరోసారి వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని చెప్పారు. మహిళలపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని... ఆయనపై షీటీమ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 
kcr
kishan reddy
cabinet
TRS
bjp

More Telugu News