raavi kondalarao: విలన్ గా ఒక వెలుగు వెలిగిన రాజనాల .. చివరిదశలో వేషాల కోసం తిరిగారు: రావి కొండలరావు

  • రాజనాల గొప్ప విలన్ 
  • జానపదాల్లో తిరుగులేదు
  •  ఆ విగ్రహం .. ఆ దర్జా వేరు  
బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో తెలుగు తెరపై రాజనాల తిరుగులేని విలన్ గా పేరు తెచ్చుకున్నారు. కండలు తిరిగిన శరీరంతో .. విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. ఆనాటి అగ్రకథానాయకులతో తలపడే ప్రతినాయకుడిగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేశారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రావి కొండలరావు మాట్లాడుతూ .. రాజనాల ప్రస్తావన తెచ్చారు.

"విలన్ గా రాజనాల ఎంతో పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో అన్ని సినిమాల్లోను ఆయనే విలన్. ముఖ్యంగా జానపద చిత్రాల్లో ప్రతినాయకుడు అంటే రాజనాలే. ఆ విగ్రహం .. ఆ దర్జా కారణంగా ఆ తరహా పాత్రలను అద్భుతంగా చేసేవారు. అలాంటి రాజనాల చివరికి .. వేషాలు ఏమైనా వుంటే ఇవ్వమంటూ తిరిగారు. ఆ తరువాత ఒక కాలును కోల్పోయి, చాలా బాధలు పడ్డారు. ఎవరైనా మనకళ్ల ముందు కింది నుంచి పైస్థాయికి చేరుకుంటే ఆనందంగా అనిపిస్తుంది. అలా కాకుండా పైస్థాయి నుంచి కిందికి జారిపోయిన వాళ్లను చూసినప్పుడు బాధ కలుగుతుంది" అని చెప్పుకొచ్చారు. 
raavi kondalarao

More Telugu News