Uttar Pradesh: ఈ నెల 26న అయోధ్య కేసుపై విచారణ

  • సెలవు ముగించుకుని వచ్చిన జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే  
  • విచారణ చేపట్టనున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం
  • ఈ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ బాబ్డే 
ఈ నెల 26న  అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. సెలవులో ఉన్న జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే తిరిగి రావడంతో వాదనలు ప్రారంభం కానున్నాయి. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. కాగా, గత నెల 29న అయోధ్య కేసు విచారణ ప్రారంభం కావాల్సిన ఉంది. అయితే, జస్టిస్ బాబ్డే సెలవుపై వెళ్లడంతో ఈ విచారణ వాయిదా పడింది. సెలవు ముగించుకుని తిరిగి ఆయన విధుల్లోకి రావడంతో విచారణ ప్రారంభం కానుంది. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు.
Uttar Pradesh
ayodhya
ram mandir
cji
Supreme Court
ranjan gogoi
justice bobdey

More Telugu News