అందుకే, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది!: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే
- మిత్రపక్షాలతో ఎలా మెలగాలన్న విషయంలో బీజేపీలో మార్పు వచ్చింది
- శివసేన అభ్యర్థి సీఎం కావాలనేది నా ఆకాంక్ష
- ఎన్నికల యుద్ధంలో మనం గెలవాలి
ఈ నేపథ్యంలో, పార్టీ నేతలతో ముంబైలోని తన నివాసంలో ఉద్ధవ్ థాకరే భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలను వారికి వివరించారు. 'మిత్రపక్షాలతో ఎలా మెలగాలన్న విషయంలో బీజేపీలో మార్పు వచ్చింది. ఆ విషయాన్ని నేను గమనించా. అందుకే ఆ పార్టీతో చేతులు కలపాలని నిర్ణయించా' అని ఉద్ధవ్ వివరించారు. అయితే, ఎక్కువ సీట్లను ఏ పార్టీ గెలుచుకుంటుందో... ఆ పార్టీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేద్దామని బీజేపీ చేసిన ప్రతిపాదన తనకు నచ్చలేదని చెప్పారు. శివసేన అభ్యర్థే సీఎం కావాలనేది తన ఆకాంక్ష అని... ఆ దిశగా తాను కృషి చేస్తానని తెలిపారు. బీజేపీతో జరిగిన ఒప్పందంలో తాను గెలిచానని... అసలైన ఎన్నికల యుద్ధంలో మనం గెలవాలని పిలుపునిచ్చారు.