Pakistan: పాక్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తాం.. ఆ తర్వాత ఆలయాల్లో గంటలు మోగవు: భారత్ కు పాకిస్థాన్ మంత్రి వార్నింగ్

  • నోరు పారేసుకున్న పాక్ మంత్రి
  • యుద్ధానికి దిగితే మేమూ సిద్ధమే
  • పక్షుల కిలకిలరావాలుండవు
పుల్వామా ఘటన నేపథ్యంలో పాక్ మంత్రి ఇండియాపై నోరు పారేసుకున్నారు. పాకిస్తాన్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. ఇండియా యుద్ధానికి దిగితే తామూ సిద్ధమేనంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మంత్రి వర్గ సహచరుడు రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియో సందేశం ద్వారా ఆయన హెచ్చరికలు చేశారు. 'మనసులో దుష్ట తలంపుతో పాకిస్తాన్ వైపు చూస్తే వాళ్ల గుడ్లు పీకేస్తాం. ఆ తర్వాత పక్షుల కిలకిలరావాలూ ఉండవు, ఆలయాల్లో గంటలూ మోగవు' అని రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
Pakistan
India
Rasheed Ahmud
Imran Khan

More Telugu News