killi kruparani: కిల్లి రాకతో వైసీపీలో కలకలం.. అసంతృప్తిలో ధర్మాన వర్గం

  • జగన్ ను కలిసిన కిల్లి కృపారాణి
  • కిల్లి రాకను వ్యతిరేకిస్తున్న ధర్మాన వర్గీయులు
  • శ్రీకాకుళం జిల్లా వైసీపీలో మొదలైన వర్గ విభేదాలు
వైసీపీ అధినేత జగన్ ను కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాసేపటి క్రితం కలిశారు. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఈనెల 28న వైసీపీలో చేరనున్నట్టు ఆమె ప్రకటించారు. మరోవైపు, కిల్లి రాకతో శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కలకలం రేగింది. జిల్లాలో వైసీపీకి ఆయువుపట్టుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వర్గీయులు కిల్లి కృపారాణి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో, జిల్లాలో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వైసీపీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి.

ఈ అసంతృప్తిపై కిల్లి కృపారాణి స్పందిస్తూ, తన చేరికపై ధర్మాన సంతృప్తిగా ఉన్నారా? లేక అసంతృప్తిగా ఉన్నారా? అనే విషయం తనకు అవసరం లేదని అన్నారు. జిల్లాలో వైసీపీ విజయం కోసం శక్తిమేర కృషి చేస్తానని చెప్పారు.
killi kruparani
Dharmana Prasad
ysrcp
jagn
Srikakulam District

More Telugu News