మరణించిన రైతు కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన చంద్రబాబు
- పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన కోటేశ్వరరావు
- మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్న సీఎం
- రైతు కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించిన చంద్రబాబు
మరోవైపు, సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, కోటేశ్వరరావు ఆత్మహత్య పట్ల ఆవేదన వెలిబుచ్చారు. పోలీసుల తీరుతోనో లేక ఇతర కారణాలతోనో మనస్తాపానికి గురైన కోటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం కోటేశ్వరరావు కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.