jayachithra: స్టార్ హీరోలందరి నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నాను: సీనియర్ హీరోయిన్ జయచిత్ర

  • శోభన్ బాబు చాలా తక్కువగా మాట్లాడేవారు
  • అక్కినేని చాలా సింపుల్ గా ఉండేవారు
  • ఎవరి ప్రత్యేకత వాళ్లదే
తెలుగులో అలనాటి అగ్రకథానాయకులందరితోను జయచిత్ర నటించారు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో మెప్పించారు. అలాంటి జయచిత్ర తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరం కథానాయకులలో నటన పరంగాను .. వ్యక్తిత్వం పరంగాను ఎవరిని మీరు ఎక్కువగా అభిమానించేవారు?' అనే ప్రశ్న జయచిత్రకి ఎదురైంది.

అందుకామె స్పందిస్తూ .. వాళ్లంతా మంచి మనసున్నవాళ్లు. ఎవరన్నా నాకు అభిమానమే .. ఎవరి ప్రత్యేకత వాళ్లదే. ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయం తెలుసుకున్నాను. మాట పొదుపుగా ఉండాలనీ .. గతాన్ని మరిచిపోకూడదనే విషయాన్ని శోభన్ బాబుగారి నుంచి నేర్చుకున్నాను. సింపుల్ గా ఉంటూ అందరినీ సమానంగా చూడాలనే విషయాన్ని ఏఎన్నార్ నుంచి తెలుసుకున్నాను. అలాగే ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ .. కృష్ణ - కృష్ణంరాజు నుంచి అంకితభావం నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు.
jayachithra

More Telugu News