India: కాంగ్రెస్ పార్టీకి ‘కిల్లి’ దంపతుల గుడ్ బై.. మరికాసేపట్లో జగన్ ఇంటికి వెళ్లనున్న నేతలు!

  • ఈరోజు వైసీపీలో చేరే ఛాన్స్
  • రాహుల్ కు రాజీనామాలు పంపిన కిల్లి దంపతులు
  • పీసీసీ కార్యదర్శిగా ఉన్న కిల్లి రామ్మోహన్ రావు
కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి, పీసీసీ కార్యదర్శి కిల్లి రామ్మోహన్‌రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను కిల్లి దంపతులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిల్లి దంపతులు వైసీపీలో చేరే అవకాశముందని భావిస్తున్నారు. మరికాసేపట్లో వీరు లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ను కలుసుకోనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
India
Congress
Andhra Pradesh
YSRCP
Jagan
killi

More Telugu News