Andhra Pradesh: ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ మాట తప్పారు.. కేసీఆర్ మాత్రం నిలబెట్టుకున్నారు!: ఎర్రబెల్లి భావోద్వేగం

  • నేతలందరినీ కలుపుకుని వెళతాను
  • జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
  • మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరినీ కలుపుకొని వెళతానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి భావోద్వేగానికి లోనయ్యారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానని చెప్పినప్పటికీ లక్ష్మీపార్వతి కారణంగా రాలేదని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం తనకు ఇచ్చిన మాటను నిలుపుకున్నారని వ్యాఖ్యానించారు.

వరంగల్ జిల్లాకు పెండింగ్ లో ఉన్న రింగ్ రోడ్డు, టెక్స్ టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తానని ఎర్రబెల్లి తెలిపారు. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకుని ముందుకు పోతానన్నారు.
Andhra Pradesh
Telangana
ydayakar rao
KCR
TRS
minister
ntr
Chandrababu
Telugudesam

More Telugu News