jayachithra: తెలుగులో మొదటి అవకాశం శోభన్ బాబు సరసన వచ్చింది: సీనియర్ హీరోయిన్ జయచిత్ర

  • రామానాయుడు గారు అవకాశం ఇచ్చారు
  •  వరుస విజయాలు పలకరించాయి
  • కథానాయికగా 200 సినిమాలు చేశాను    
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో కథానాయికగా జయచిత్ర 200 సినిమాలు చేశారు. అందాల కథానాయికగా అశేష ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అలాంటి జయచిత్ర తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"తమిళంలో నేను 30 సినిమాలు చేసిన తరువాత తెలుగులో నాకు అవకాశం వచ్చింది. రామానాయుడుగారు 'సోగ్గాడు' సినిమాలో శోభన్ బాబు సరసన కథానాయికగా నాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత వచ్చిన 'యవ్వనం కాటేసింది' .. 'సావాసగాళ్లు' .. 'కటకటాల రుద్రయ్య' .. 'చిల్లరకొట్టు చిట్టెమ్మ' ఘన విజయాలను అందుకున్నాయి. అలా భగవంతుడు నాకు మంచి మంచి అవకాశాలు వచ్చేలా చేయడం వల్లనే కథానాయికగా నేను నిలదొక్కుకోగలిగాను" అని ఆమె చెప్పుకొచ్చారు. 
jayachithra
ali

More Telugu News