Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. పెళ్లి ఊరేగింపుపైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 13 మంది మృతి

  • అదుపు తప్పి ఊరేగింపు పైకి దూసుకొచ్చిన ట్రక్
  • మృతుల్లో నలుగురు చిన్నారులు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని అంబవాలి గ్రామంలో ఓ పెళ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకొచ్చిన ఘటనలో 13 మంది దుర్మరణం పాలవగా మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో పెళ్లి ఊరేగింపు కాస్తా విషాదంగా మారింది. క్షతగాత్రులను చోటిసద్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెనక నుంచి వచ్చిన ట్రక్ అదుపుతప్పి పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పెళ్లి కుమార్తె రేఖను అక్కడి నుంచి తరలించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan
marriage
procession
Jaipur
Truck
Road Accident

More Telugu News