Andhra Pradesh: నేను టీడీపీని వీడను..వైసీపీలో చేరను: చంద్రబాబును కలిసిన తోట త్రిమూర్తులు

  • పార్టీ మారతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు
  • వైసీపీ నేతలను నేను కలవలేదు
  • ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో కలిసి చర్చిస్తా
టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరతారన్న వార్తలు వినవస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబును ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ మారతానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలను తాను కలవలేదని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో కలిసి చర్చిస్తానని అన్నారు.

చంద్రబాబును కలిసిన వైసీపీ నాయకుడు ఎడం బాలాజీ

ఇదిలా ఉండగా, చీరాల వైసీపీ నాయకుడు ఎడం బాలాజీ కూడా చంద్రబాబును కలిశారు. ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరికకు ముందు చీరాల వైసీపీ ఇన్ చార్జిగా ఆయన వ్యవహరించారు. వైసీపీలోకి ఆమంచి కృష్ణ మోహన్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బాలాజీ, వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ఆయన కలిసినట్టు తెలుస్తోంది.
Andhra Pradesh
cm
Chandrababu
Telugudesam
Thota Trimurthulu
YSRCP
jagan

More Telugu News