Ramanaidu: రామానాయుడు వర్థంతి సందర్భం.. వెంకటేశ్, రానాల ఆవేదనతో కూడిన పోస్ట్

  • మాకు జ్ఞాపకాల్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
  • మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు
  • మీరు నింపిన స్ఫూర్తి మరింత దృఢంగా మార్చింది
నేడు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వర్థంతి. ఫిబ్రవరి 18, 2015న రామానాయుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రామానాయుడిని తలచుకుంటూ ఆవేదనతో ఆయన తనయుడు, ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్, మనవడు రానా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘మాకు ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేం మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం. ఎప్పటికీ మీ లోటు ఇలానే ఉంటుంది’ అంటూ వెంకటేశ్‌ తండ్రితో ఉన్న ఫొటోల్ని షేర్‌ చేశారు. ‘మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. కానీ మీరు నింపిన స్ఫూర్తి మమ్మల్ని మరింత దృఢంగా తయారు చేసింది. మిస్‌ యు తాత’ అని చిన్నప్పుడు తనను రామానాయుడు ఎత్తుకుని దిగిన ఫోటోను రానా షేర్ చేశాడు.
Ramanaidu
Death Anniversary
Venkatesh
Rana
Social Media

More Telugu News