amaravathi: అమరావతిలో చంద్రబాబుతో కేజ్రీవాల్ భేటీ

  • జాతీయ రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • మహాకూటమి బలోపేతం, కార్యాచరణపైనా 
  • గన్నవరంలో కేజ్రీవాల్ కు స్వాగతం పలికిన దేవినేని
ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై నేతలిద్దరూ చర్చిస్తున్నట్టు సమాచారం. మహాకూటమి బలోపేతం, కార్యాచరణ తదితర అంశాల పైనా వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, అమరావతి చేరుకున్న కేజ్రీవాల్ కు పుష్పగుచ్ఛం అందజేసిన నారా లోకేశ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి కేజ్రీవాల్ కు క్లుప్తంగా లోకేశ్ వివరించారు. అంతకుముందు, గన్నవరం విమానాశ్రయంలో కేజ్రీవాల్ కు మంత్రి దేవినేని ఉమ స్వాగతం పలికారు. 
amaravathi
Chandrababu
delhi
kejriwal

More Telugu News