Andhra Pradesh: పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలి: సీఎం చంద్రబాబు

  • పదవులు రావన్న భయంతోనే పార్టీలు మారుతున్నారు
  • నిత్యం ప్రజల్లో ఉండేవారికే మా పార్టీ టికెట్లు ఇస్తాం
  • మోదీ మరోసారి విభజన గాయాలను రేపుతున్నారు
పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ఆ నేతలు తమకు పదవులు రావన్న భయంతోనే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉండేవారికే తమ పార్టీ టికెట్లు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, టీఆర్ఎస్, వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. మోదీ మరోసారి రాష్ట్ర విభజన గాయాలను రేపుతున్నారని, నవ్యాంధ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. వైసీపీకి టీఆర్ఎస్ లోపాయికారీ మద్దతు ఇస్తోందని విమర్శించారు.
Andhra Pradesh
cm
Chandrababu
kondaveedu

More Telugu News