suhana khan: అతనితో డేటింగ్ చేయాలని ఉంది: షారుక్ ఖాన్ కుమార్తె సుహానా

  • కుమార్తెను వెండితెరపై చూడాలనుకుంటున్న షారుక్ ఖాన్
  • ఇప్పటికే సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న సుహానా
  • దక్షిణ కొరియా సింగర్ సుహోతో డేటింగ్ చేయాలని ఉందన్న సుహానా
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నారనే విషయం తెలిసిందే. 18 ఏళ్ల సుహానాను బాలీవుడ్ లో భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇప్పటికే సుహానా సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఎంతో మంది ఫాలోయర్లు ఉన్నారు.

తాజాగా సుహానాకు ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ డేటింగ్ చేయాలనుకుంటే మీరు ఎవరితో డేటింగ్ చేస్తారు? అని ఓ అభిమాని ఆమెను ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా... 'దక్షిణ కొరియా సింగర్, యాక్టర్ సుహోతో డేటింగ్ చేయాలనుకుంటున్నా' అని తెలిపింది. అంతే కాదు సుహో ఫొటోను కూడా షేర్ చేసింది. సుహో అసలు పేరు కిమ్ జున్ మియాన్. 
suhana khan
dating
kim un myeon
bollywood
shah rukh khan

More Telugu News