allu aravind: బాలీవుడ్ హిట్ మూవీ 'గల్లీ బాయ్' రీమేక్ ఆలోచనలో అల్లు అరవింద్?

  • హిందీలో హిట్ కొట్టిన 'గల్లీబాయ్'
  • విభిన్నమైన కథాకథనాలు
  • రీమేక్ హక్కుల కోసం పోటీ  
ఇప్పుడు రణ్ వీర్ సింగ్ కి మంచి టైమ్ నడుస్తోంది. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 14వ తేదీన విడుదలైన 'గల్లీ బాయ్' ఘన విజయాన్ని సాధించింది. అలియా భట్ కథానాయికగా నటించిన ఈ సినిమా, 4 రోజుల్లో 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. వైవిధ్యభరితమైన కథాకథనాలు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయనే టాక్ వినిపిస్తోంది.

దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల చిత్ర నిర్మాతలు చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో తెలుగు నుంచి అల్లు అరవింద్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుని, సాయిధరమ్ తేజ్ తో గానీ .. వైష్ణవ్ తేజ్ తో గాని తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో అల్లు అరవింద్ వున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని కూడా చెప్పుకుంటున్నారు.
allu aravind

More Telugu News